ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 6.1 గా భూకంప తీవ్రత నమోదైంది. 6.1 తీవ్రతతో భూకంపం రావడంతో సుమారు 250 మరణించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ లోని ఖోస్ట్‌కు 44కిమీ దూరంలో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో పలుమార్లు ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అనేకమంది శిథిలాల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.